పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్ హౌస్‌లో ఏడు మోటార్ల ద్వారా పార్వతి బ్యారేజ్‌లోని నీటిని ఎత్తిపోస్తున్నారు.
గత నాలుగు రోజులుగా నీటి ఎత్తిపోతల ప్రక్రియ జరుగుతోంది. తొలుత రెండు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి... ప్రవాహం పెరిగే కొద్దీ విడతల వారీగా మూడు, ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఇవాళ ఏడు మోటార్లను రన్‌చేస్తూ.. మొత్తం 14 పైపుల ద్వారా నీటిని పార్వతి బ్యారేజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.518 టీఎంసీల నీరు నిల్వా ఉంది. ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటిని పార్వతి బ్యారేజ్‌లోకి ఎత్తి పోస్తుండడం వల్ల ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
నిండుకుండలా మధ్యమానేరు..