తెలంగాణ

telangana

ETV Bharat / state

'అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పదోన్నతి కల్పించాలి' - Peddapalli District latest news

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ అమలు చేయాలని... పీఆర్​టీయూ నేతలు అన్నారు. హక్కుల సాధన కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి... కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు.

teachers union prtu rally in Peddapalli district
అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పదోన్నతి కల్పించాలి

By

Published : Feb 9, 2021, 6:35 PM IST

అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం వెంటనే పదోన్నతి కల్పించాలని... పీఆర్​టీయూ నేతలు డిమాండ్​ చేశారు. సీపీఎస్ రద్దు చేసి అందరికీ న్యాయం చేయాలని అన్నారు. హక్కుల సాధన కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి... కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details