తెలంగాణ

telangana

ETV Bharat / state

గణేశుడి నిమజ్జనానికి గజ ఈతగాళ్లు సిద్ధం - పెద్దపల్లి జిల్లా తాజా వార్త

వినాయక నిమజ్జనంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్దపల్లి జిల్లా బెస్తపల్లి నుంచి ఏడుగురు గజ ఈతగాళ్లను గోదావరి నది వద్ద స్వచ్ఛంద సేవకు ఆ గ్రామ సర్పంచ్ తోకల శైలజగంగపుత్ర ఎంపిక చేశారు​. నిమజ్జన సమయంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన తమను సంప్రదించవచ్చని గజ ఈతగాళ్ల కమిటీ వెల్లడించింది.

Swimmers were assigned to the Ganesh Immersion program held in the Godavari river area of Peddapalli district
గణేశుడి నిమజ్జనానికి గజ ఈతగాళ్లు ఎంపిక

By

Published : Sep 2, 2020, 12:38 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని గోదావరి నదిలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నదిలో నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బెస్తపల్లి సర్పంచ్ తోకల శైలజ గంగపుత్ర, ఆమె భర్త తోకల నర్సయ్య గంగపుత్ర ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ పరిధి నుంచి ఏడుగురు గజ ఈతగాళ్లను స్వచ్ఛంద సేవ చేయడానికి నియమించారు. ఏటా గణేష్ నిమజ్జనానికి తమ గ్రామం నుంచి గజ ఈతగాళ్లను స్వచ్ఛంద సేవకులుగా ఎంపిక చేస్తామని నర్సయ్య వెల్లడించారు.

ఈసారి ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్ల కమిటీలో తోకల నర్సయ్య, బెస్తపల్లి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ధర్మాజీ నగేష్, బెస్తపల్లి గ్రామపెద్ద బోరే మొండయ్య, తోకల రాజయ్య, ఉట్నూర్ లింగయ్య, కూనారపు లక్ష్మణ్, ధర్నాజీ రాజేందర్ గంగపుత్ర తదితరులు చోటు దక్కించుకున్నారు.

నిమజ్జనం సందర్భంగా ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తమను సంప్రదించవచ్చని తోకల నర్సయ్య గంగపుత్ర వెల్లడించారు. ప్రమాదాలను పూర్తిగా అరికట్టి విఘ్నేశుడి నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఇవీచూడండి:మైనర్​పై దాష్టీకం: మత్తు మందు కలిపి అత్యాచారం... భార్య సహకారం

ABOUT THE AUTHOR

...view details