పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకర్ పూలమాలవేసి నివాళులర్పించారు. స్వేరోస్, ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2కే రన్ని ఛైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు.
2కే రన్ ముఖ్య ఉద్దేశం అందరూ ఆరోగ్యంగా ఉండాలనీ.. ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవని తెలపడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.