తెలంగాణ

telangana

ETV Bharat / state

భారతదేశానికి యువతే బలం : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు - మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, జాతి గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబు అన్నారు. తన నివాసంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు.

swami vivekananda birth anniversary celebrations in peddapalli
భారతదేశానికి యువతే బలం : ఎమ్మెల్యే శ్రీధర్

By

Published : Jan 12, 2020, 4:13 PM IST

భారతదేశానికి బలం యువతేనని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద మార్గంలో యువత ముందుకు నడవాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​ బాబు అన్నారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి యువకుడు మోయాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని తన నివాసంలో శ్రీధర్​బాబు.... స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు.

భారతదేశానికి యువతే బలం : ఎమ్మెల్యే శ్రీధర్

సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడానికి కేసీఆర్​ సర్కార్​ రవాణా ఛార్జీలు పెంచిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. గతేడాది మంథని నుంచి మేడారానికి ఆర్టీసీ 205 రూపాయలు వసూలు చేసింది, ఈ ఏడాది టికెట్​ ధర 260 రూపాయలు నిర్ణయించిందని తెలిపారు.

సమ్మక్క జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తులు వస్తారని, ఈ సమయంలో మేడారం జాతరకు వెళ్లే బస్సు టికెట్ ధర పెంచి, సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు కోరారు.

ABOUT THE AUTHOR

...view details