రహదారి ప్రమాదాల నివారణ కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ట్రినిటీ కళాశాల విద్యార్థులతో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెల్మెట్ ధరించి నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
హెల్మెట్ ధరించి విద్యార్థులు జోర్దార్ డ్యాన్స్ - students flashmab
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులతో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. విద్యార్థులు హెల్మెట్ ధరించి చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
హెల్మెట్ ధరించి విద్యార్థులు జోర్దార్ డ్యాన్స్
ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన ఉంటే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనం నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆఫ్రీన్ సిద్దిఖీతో పాటు ఏసీబీ హబీబ్ ఖాన్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:స్టెప్పులేస్తూ... అవగాహన కల్పిస్తూ... విద్యార్థుల ఫ్లాష్‌మాబ్