పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమలో సాంకేతిక లోపంతో 7వ యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 7వ యూనిట్లోని టర్బైన్ ప్రాంతంలో వాయు పీడనం తగ్గిపోయి ఉత్పత్తి క్రమేపీ తగ్గుముఖం పట్టింది. టర్బైన్ ప్రాంతంలో మరమ్మతులు చేపట్టాలని ప్రణాళికలు వేశారు.
ఎన్టీపీసీలో సాంకేతికలోపం... విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం
రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపంతో 7వ యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 7వ యూనిట్లోని టర్బైన్ ప్రాంతంలో వాయు పీడనం తగ్గిపోయి ఉత్పత్తి క్రమేపీ తగ్గుముఖం పట్టింది.
ఎన్టీపీసీలో సాంకేతికలోపంతో నిలిచిపోయిన విద్యుత్తు ఉత్పత్తి
దాదాపు 15రోజుల పాటు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా మిగతా 6 యూనిట్లలో మొత్తం 1800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. వార్షిక లక్ష్యం సమీపిస్తున్న తరుణంలో 7వ యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కాగా 6 యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తికి అధికారులు నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి:తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్