తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

నాలుగు రోజులుగా భారీ వర్షాలతో గోదావరిలో నీటి ప్రవాహానికి ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

sripada yellampalli project fill with water and release through 8 gates
నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

By

Published : Aug 18, 2020, 12:29 PM IST

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరగడంతో 8 గేట్లను 2 మీటర్లు ఎత్తి 82,488 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 37 నుంచి 44 గేట్ల ద్వారా నీటి ప్రవాహం గోదావరి నదిలోకి వెళ్తుంది.

నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా... 147.59 మీటర్లకు చేరుకుంది. జలాశయం సామర్థ్యం 20 టీఎంసీలకు గానూ... 19.0362 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం 67,161 క్యూసెక్కుల నీరు చేరుతోంది. గేట్లు ఎత్తడం వల్ల లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ... అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం పెరగడం వల్ల ప్రాజెక్టు వద్దకు ప్రజలు వెళ్లకుండా... పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details