ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ కమిషనర్ వి. సత్యనారాయణ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో లాక్డౌన్ తీరును రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షించారు. పట్టణంలోని వీధుల్లో నుంచి బయట తిరిగే ప్రజల కోసం డ్రోన్ కెమెరా ఏర్పాటు చేసి నిఘా పెంచామని.. అనవసరంగా ఇళ్ల నుంచి బయట తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా - telangana varthalu
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ కమిషనర్ వి. సత్యనారాయణ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. రామగుండంలో చిత్రీకరించిన డ్రోన్ దృశ్యాల్లో పట్టణ వీధులు జనసంచారం లేక బోసిపోయి కనిపించాయి.
![లాక్డౌన్ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా లాక్డౌన్ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11775490-660-11775490-1621113534206.jpg)
లాక్డౌన్ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా
లాక్డౌన్ నేపథ్యంలో రామగుండంలో డ్రోన్లతో ప్రత్యేక నిఘా
లాక్డౌన్ నేపథ్యంలో రామగుండంలో చిత్రీకరించిన డ్రోన్ దృశ్యాల్లో పట్టణ వీధులు జనసంచారం లేక బోసిపోయి కనిపించాయి. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ దెబ్బకు రూ.50లక్షలకు పడిపోయిన ఆదాయం