హనుమాన్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గోదావరిఖని విట్టల్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేపట్టారు. స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, హోమం - peddapalli distrcit
గోదావరిఖని విట్టల్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మంత్రోచ్ఛారణలతో స్వామివారికి అభిషేకం