పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్డౌన్ ప్రక్రియను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో సుమారు గంట పాటు పట్టణంలోని అన్ని వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలో 6000 వాహనాలు సీజ్ - రామగుండం సీపీ సత్యనారాయణ
లాక్డౌన్ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహించారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలో 6000 వాహనాలు సీజ్
కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు సుమారు 6000 పైగా వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. రోడ్లమీద తిరిగే యువకులు శృతిమించితే వారిని చెదరగొట్టడానికి ప్రత్యేక బలగాలను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు అనుమతించిన సమయంలోనే బయటకు వచ్చి నిత్యావసర వస్తువులను తీసుకెళ్లాలని సూచించారు. అలాగే ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని సీపీ సత్యనారాయణ కోరారు.