son Abandoned mother in Telangana : తన ప్రాణాలు పణంగా పెట్టి వారికి ప్రాణం పోసిందా తల్లి. తన పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోయేది ఆ మాతృహృదయం. రేయింబవళ్లు కష్టపడి వారిని పెంచి పెద్దచేసింది. అడిగిన ప్రతీది.. తాహతుకు మించినదైనా సరే వాళ్ల పాదాల వద్దకు చేర్చింది. కష్టనష్టాలకోర్చి.. ఓ పూట తిని మరో పూట పస్తులుండి.. కన్నబిడ్డల్ని ప్రయోజకుల్ని చేసింది. వారికి నచ్చిన వాళ్లకిచ్చి వివాహం జరిపించింది.
ఎముకలు కొరికే చలిలో..
son Abandoned mother in Peddapalli : పెళ్లై పిల్లలు పుట్టగానే.. ఇన్నేళ్లు తమను పెంచిన తల్లి వారికి చేదయింది. ఆమెను చూస్తే చిరాకు మొదలైంది. వృద్ధాప్యఛాయలొచ్చిన ఆ మాతృమూర్తితో ఇక తమకేం పనిలేదనుకున్నారు ఆమె పిల్లలు. నెమ్మదిగా పట్టించుకోవడం మానేశారు. తర్వాత తిండి పెట్టడం ఆపేశారు. చివరకు ఇంట్లో నుంచి గెంటేశారు. కట్టుకున్నవాడు లేడు. కన్నబిడ్డలకు తనక్కర్లేదు. అడుక్కోవాలంటే ఆత్మాభిమానం అడ్డొస్తోంది. పిల్లల కోసం పస్తున్న తను.. ఇప్పుడు తన కోసం ఉండలేనా.. రెండ్రోజులు తినకపోతే చావనుకదా అనుకుంది. నిలువ నీడలేక.. ఓ కళాశాల భవనం వద్ద గోడకు ఒరిగింది. ఎముకలు కొరికే చలిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది.