ఏఐటీయూసీలోకి పలు కార్మిక సంఘాల నేతల చేరిక - labour union
ఏఐటీయూసీ కార్మికులకు చేస్తున్న కృషిని గుర్తించి పలువురు సింగరేణి కార్మికులు తమ యూనియన్‌లో చేరారని ఏఐటీయూసీ నాయకులు అన్నారు.
ఏఐటీయూసీలోకి పలు కార్మిక సంఘాల నేతల చేరిక
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని పలు కార్మిక సంఘాల నాయకులు ఏఐటీయూసీలో చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వారికి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. అనంతరం పట్టణ ప్రధాన వీధులగుండా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్మికుల కోసం ఏఐటీయూసీ చేస్తున్న కృషిని గుర్తించి పలు కార్మిక సంఘాల నాయకులు చేరారని, భవిష్యత్‌లో మరిన్ని చేరికలుంటూయని ఏఐటీయూసి నాయకులు తెలిపారు.
- ఇదీ చూడండి : బ్యాగు కిందపెట్టినందుకు వైద్యురాలిపై దాడి