పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లైన్ కాలనీలోని ఒక కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో కుటుంబంలో ఇద్దరు కొవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలో వ్యాపారులు ఎవరికి వారు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించుకుంటున్నారు.
ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్... అప్రమత్తమైన స్థానికులు - peddapally news
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివాసమున్న ఓ కుంటుంబంలోని ఆరుగురికి కరోనా సోకింది. ఈ ఫలితాలతో అప్రమత్తమైన స్థానికులు స్వీయ లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు.
ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్... అప్రమత్తమైన స్థానికులు
నగరంలోని మీసేవా కేంద్రాల నిర్వాహకులు కూడా స్వచ్ఛందంగా సేవలను నిలిపివేశారు. ఇప్పటికే గోదావరిఖనిలోని ప్రధాన వ్యాపార కేంద్రంలో దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించగా... అదే బాటలో చిరువ్యాపారులు, స్వీట్, బేకరీ, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.