కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు ఉద్యోగాలు చేపట్టిన సమ్మె రెండోరోజు చేరుకుంది. ఒకరోజు సమ్మెకు మద్దతు తెలిపిన సింగరేణి గుర్తింపు సంఘం... నేడు సమ్మెలో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో టీబీజీకే అనుబంధ కార్మికులు గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మిగతా కార్మికుల అనుబంధ సంఘాల నాయకులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులు జాతీయ కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
రెండో రోజుకు చేరుకున్న సింగరేణి కార్మికుల సమ్మె - సింగరేణి కార్మికుల సమ్మె
బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. మొదటి రోజు మద్దతు తెలిపిన టీబీజీకే... నేడు విధులకు హాజరయ్యేందుకు సిద్ధమైంది. ఇతర సంఘాల నాయకులువారిని అడ్డుకోగా... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
![రెండో రోజుకు చేరుకున్న సింగరేణి కార్మికుల సమ్మె singreni-mine-workers-protest-second-day-in-peddapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7871319-thumbnail-3x2-protest.jpg)
రెండో రోజుకు చేరుకున్న సింగరేణి కార్మికుల సమ్మె