తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతాలు పెంచాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన - singareni labours problems

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఓబీ కంపెనీ కార్యాలయం ఎదుట సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. ఓబీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.

singareni contract labours protest for salary increment in peddapally
జీతాలు పెంచాలంటూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన

By

Published : Jun 27, 2020, 4:12 PM IST

సింగరేణి ఓబీ కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆర్జీ 3 అడ్రీయాల సింగరేణి ప్రాజెక్టులోని ఎన్సీసీఓబీ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వివిధ రంగాల్లోని తాత్కాలిక కార్మికులు 2 రోజులుగా నిరసన చేపట్టారు.

ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కార్మికులు, ఆపరేటర్లు, డ్రైవర్లకు ప్రతిఏటా.. జీతాలు పెంచుతామని ముందస్తుగా ఒప్పందం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నెలల ముందు కార్మికులకు జీతాలు పెంచాలని వినతి పత్రం సమర్పించినప్పటికీ పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

రెండు రోజులుగా టోకెన్ సమ్మె చేస్తున్నా... యాజమాన్యం పట్టించుకోవాటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 300 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఓబీ కంపెనీ కార్యాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఆఫీస్​లో అనుమతించకపోవటం వల్ల గేటు ముందే కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఇదీ చూడండి:ఆ ఒక్క కారణంతో 18 వేల మంది ఖైదీలు విడుదల

ABOUT THE AUTHOR

...view details