పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని గోదావరిఖని ఆర్సీ క్లబ్లో... సింగరేణి కళా స్రవంతి, సింగరేణి యంగ్ తరంగ్ పోటీలు నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ ఎస్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సింగరేణి ఉత్పత్తి, కార్మికుల సంక్షేమమే కాకుండా కళాకారుల ప్రతిభ వెలికి తీసేందుకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన 11 ఏరియాల నుంచి కళాకారులు పాల్గొని తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు.
సింగరేణి కళా స్రవంతి&యంగ్ తరంగ్ పోటీలు - peddapalli
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో... సింగరేణి కళా స్రవంతి, కళా యంగ్ తరంగ్ పోటీలు నిర్వహించారు.
సింగరేణి కళా స్రవంతి&యంగ్ తరంగ్ పోటీలు