పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం నుంచి నుంచి గోదావరిఖనికి వెళ్లే ప్రధాన రహదారిపై శాంతి నగర్ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించడం వల్ల సుమారు మూడు గంటలపాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎఫ్సీఐ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఎఫ్సీఐ నుంచి వచ్చే నీటిని ఇళ్లల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్థానికులు హెచ్చరించారు.
కాలనీలోకి నీరు చేరిందని రాస్తారోకో.. శాంతింపజేసిన ఎమ్మెల్యే - రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం
గోదావరిఖనిలోని శాంతినగర్ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. రామగుండం ఎరువుల రసాయనాల కార్మాగారం నుంచి విడుదలయ్యే నీరు కాలనీలోకి వస్తుందని ఆందోళన చేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్ సమాచారం అందుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.
కాలనీలోకి నీరు చేరిందని రాస్తారోకో.. శాంతింపజేసిన ఎమ్మెల్యే
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్లు ఎఫ్సీఐ యాజమాన్యాన్ని పిలిపించి వెంటనే నీరు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం శాంతినగర్లోకి చేరిన వరద నీటిని పరిశీలించారు.
ఇవీ చూడండి:మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం