మంథని జేఎన్టీయూలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు మహిళలు స్వీపర్లుగా పని చేస్తున్నారు. గుత్తేదారు హనుమంత్ రెడ్డి , సూపర్ వైజర్ సమ్మయ్య రోజు లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు న్యాయం కోసం ఇక్కడికి వచ్చామని పోలీసులకు చెప్పారు. అయితే..గుత్తేదారు హనుమంత్‌రెడ్డి మాత్రం ఆ ఇద్దరు మహిళలు సక్రమంగా పనులు చేయట్లేదని, ప్రిన్సిపల్ వారిని విధుల నుంచి తొలగించారని చెబుతున్నాడు.
' ఇంజినీరింగ్ కాలేజ్‌లో లైంగిక వేధింపులు' - JNTUK
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఇంజనీరింగ్ కళాశాల హౌస్ కీపింగ్ గుత్తే దారుడు, పర్యవేక్షకుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు.
ప్రిన్సిపల్ మమ్మల్ని విధుల నుంచి తొలగించారు : బాధితులు