పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు ఉదయం 3 గంటల నుంచి ఒక్కొక్కరుగా విధుల్లోకి చేరారు. మంథని డిపోకు చెందిన మహిళా కండక్టర్ పుష్పలత ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ. ఆర్థిక పరిస్థితుల వల్ల ఆమె విధులకు హాజరైంది. గత మూడు నెలల నుంచి జీతాలు లేక వైద్య ఖర్చులకు ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపింది. ఈరోజు వీధుల్లోకి చేరుతున్నానని.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది.
విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ - పెద్దపల్లి జిల్లా మంథని డిపో
పెద్దపల్లి జిల్లా మంథని డిపోలో ఏడు నెలల గర్భిణీ విధులకు హాజరైంది. సమ్మె వల్ల గత మూడు నెలల నుంచి ఆర్థికంగా ఇబ్బందిపడ్డానని తెలిపింది.
![విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5212503-460-5212503-1575008448893.jpg)
విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ
విధులకు హాజరైన ఏడు నెలల గర్భిణీ
అలాగే డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. డిపోలో బస్సులకు మరమ్మతులు చేయడానికి మెకానిక్లు తలమునకలయ్యారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు