హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ రామకృష్ణ కుటుంబంతో కలిసి మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద వీరి కారు కల్వర్టును ఢీకొని... కాలువలోకి దూసుకెళ్లింది.
కాలువలోకి దూసుకెళ్లిన కారు..తప్పిన ప్రాణాపాయం.. - కల్వర్టును ఢీకొని కారు ప్రమాదం
కల్వర్టును ఢీకొని కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి వద్ద చోటు చేసుకుంది. అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఏడుగురికి గాయాలు
ఈ ప్రమాదంలో ఏడుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. డీసీపీ రవీందర్, ఏసీపీ హబీబ్‌ఖాన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.