మంథని మున్సిపల్ పట్టణ పరిధిలోని తమ్మ చెరువుకట్ట జానకిరామ కల్యాణ వేదిక ప్రాంగణంలో 45 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం సహా 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత ఐదు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నందున నెల రోజులకు సరిపడా సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్ యాదవ్ చేతుల మీదుగా మాస్క్లు, శానిటైజర్లు అందించారు.
వారి సేవలు అభినందనీయం...
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో సేవక్ ఫౌండేషన్ వివిధ సేవలు అందించడం అభినందనీయమని సీఐ మహేందర్ తెలిపారు. కొవిడ్ వైరస్ నియంత్రణకు ప్రజల్లో చైతన్యం కలిగించినందుకు సేవక్ ఫౌండేషన్ సభ్యులను పోలీసులు సన్మానించారు. సేవక్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ తన వంతు సహాయంగా రూ.5 వేలను సంస్థ ప్రతినిధి ముస్కుల లోకేందర్కు అందించారు. మంచి కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు, సేవక్ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.