పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు కొవిడ్ టీకా రెండో డోసు కోసం పెద్దఎత్తున ప్రజలు బారులు తీరారు. కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వచ్చిన వారికి 10 గంటల సమయంలో టోకెన్లు ఇవ్వడం వల్ల అందరూ ఒక్కసారిగా టెస్టు కోసం ఎగబడ్డారు.
కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ కోసం ప్రజల బారులు
రాష్ట్రంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సూపర్ స్ప్రెడర్లకు ప్రత్యేకంగా టీకా వేయనున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్ కోసం పెద్దఎత్తున ప్రజలు బారులు తీరారు.
కరోనా వ్యాక్సినేషన్, రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్
కొవాగ్జిన్ వ్యాక్సిన్ కొన్ని సెంటర్లలో మాత్రమే ఉందని తెలియక.. ఉదయం నుంచి పడిగాపులు కాసి.. తీరా టీకా వేసే సమయానికి కొవీషీల్డ్ వ్యాక్సిన్ అని తెలిసి చాలా మంది వెనుతిరిగారు. ఏ టీకాలు ఇస్తున్నారో ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇస్తే ఇబ్బందులు ఉండవని ప్రజలు అభిప్రాయపడ్డారు. మంథని సామాజిక వైద్యశాలలో టెస్టులు, టీకా కేంద్రం పక్కపక్కనే ఉండటం వల్ల రద్దీ ఎక్కువగా కనిపించింది.