పెద్దపల్లి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ప్రతి విద్యార్థికి శానిటైజర్‌తో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. తరగతిగదిలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
కొవిడ్ నిబంధనల మధ్య పాఠశాలల పునః ప్రారంభం - peddapalli district news
పది నెలల పాటు నిర్జీవంగా మారిన పాఠశాలలు విద్యార్థుల రాకతో నేడు కళను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని బడులన్నీ విద్యార్థులతో కోలాహలంగా మారాయి.
కొవిడ్ నిబంధనల మధ్య తరగతులు
తల్లిదండ్రుల అంగీకారం తీసుకున్న విద్యార్థులనే పాఠశాలలోనికి అనుమతించారు. మొదటి రోజు కావడం వల్ల ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహించారు. చాలా రోజుల తర్వాత బడికి వచ్చిన విద్యార్థులు తమ స్నేహితులను కలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.