తెలంగాణ

telangana

ETV Bharat / state

'అసత్యపు ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టండి' - తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం

తెరాస ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ప్రపంచ వ్యాప్తంగా మెచ్చుకుంటుంటే... ప్రతిపక్ష పార్టీలు మాత్రం సీఎం కేసీఆర్​పై అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను తెరాస నేతలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.

SC Welfare Minister Koppula Ishwar
'అసత్యపు ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టండి'

By

Published : Feb 14, 2021, 8:35 PM IST

రాష్ట్రంలో తెరాస తిరుగులేని రాజకీయ పార్టీ అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెరాస ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంటే... ప్రతిపక్ష పార్టీలు మాత్రం సీఎం కేసీఆర్​పై అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను తెరాస నేతలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని ఆయన సూచించారు. 15 రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పూర్తి చేయాలని అన్నారు.

ఇదీ చదవండి:సభ్యత్వ నమోదులోనూ సిద్దిపేట ముందుండాలి: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details