రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తన కళతో అభిమానాన్ని చాటుకున్నాడు ఓ కళాకారుడు. పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరు గ్రామానికి చెందిన సైకతశిల్పి రేవెళ్లి శంకర్... ఇసుకతో కేసీఆర్ బొమ్మను తీర్చిదిద్దాడు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కోటి వృక్షార్చన చేస్తుంటే... శంకర్ మాత్రం తనకున్న కళతోనే ప్రత్యేకతను ప్రదర్శించాడు.
ఇసుకతో కేసీఆర్ బొమ్మ..సైకతశిల్పి వినూత్న శుభాకాంక్షలు
కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకు అందరూ కోటీ వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొంటుంటే... ఓ కళాకారుడు మాత్రం విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. తన ప్రతిభతో సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకతను చాటుకున్నాడు.
ఇసుకతో కేసీఆర్ బొమ్మ చేశాడు.. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు..
5 బస్తాల తడి ఇసుకతో కేవలం 5 గంటల్లోనే కేసీఆర్ బొమ్మను తీర్చిదిద్దాడు. ఇప్పటి వరకు దాదాపు 100 సైకత శిల్పాలను రూపొందించానని... ఈసారి మాత్రం తన అభిమాన నాయకుడి శిల్పాన్ని తీర్చిదిద్దడం ఎంతో సంతృప్తికరంగా ఉందని శంకర్ తెలిపాడు.
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ