జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సిక్తాపట్నాయక్ - గోదావరిఖని సమక్క సారక్క జాతర ఏర్పాట్లు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిక్తా పట్నాయక్... గోదావరిఖనిలో పర్యటించారు. సమక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు పూర్తి స్థాయిలో లేకపోవటం వల్ల అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించనున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. గోదావరి వంతెన వద్ద నిర్వహించే మినీ మేడారం జాతర ఏర్పాట్ల పనులను పర్యవేక్షించారు. మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలను పరిశీలించారు. పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాకపోవటం వల్ల రామగుండం నగర కమిషనర్ ఉదయ్ కుమార్కు పూర్తి చేపించాల్సిన బాధ్యతలను అప్పగించారు. సింగరేణి ఎన్టీపీసీ సహకారంతో జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సిక్తాపట్నాయక్ ఆదేశించారు.