పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. నగరంలోని వెంకటేశ్వర ప్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అందాల తార పాయల్ రాజ్‌పుత్ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. జ్యోతి వెలిగించిన పాయల్... మాల్లోని పలు అందమైన చీరలను ప్రదర్శిస్తూ.. అందరిని ఆకట్టుకున్నారు.
Payal: పెద్దపల్లిలో ఆర్ఎక్స్100 బామ పాయల్ సందడి - payal rajput in peddapalli
పెద్దపల్లిలో ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. నగరంలోని వెంకటేశ్వర ప్యామిలీ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించేందుకు వచ్చిన అందాల తారను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పెద్దపల్లికి రావటం సొంతూరికి వచ్చినట్టు ఉందని పాయల్ తెలిపారు.

"పెద్దపల్లిలో పాపింగ్మాల్ ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉంది. మాల్ యజమానులకు కృతజ్ఞతలు. మినీ బడ్జెట్లో మెగా షాపింగ్ అనే ట్యాగ్‌లైన్ నాను చాలా నచ్చింది. మధ్యతరగతి ప్రజలు షాపింగ్‌మాల్‌కు వెళ్లాలంటే భయపడతారు. ధరలు ఎక్కువగా ఉంటాయని... వాటిని మనం భరించలేమని.. రావటానికి వెనకడుగు వేస్తారు. వెంకటేశ్వర షాపింగ్‌మాల్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సరసమైన ధరల్లో కుటుంబసమేతంగా షాపింగ్ చేసేలా మంచి బట్టలను అందుబాటులో ఉంచారు. ఇక్కడ చీరలు నాకు చాలా నచ్చాయి. మళ్లీ ఒక్కసారి వచ్చి నేను ఇక్కడ షాపింగ్ చేస్తా. ఇక్కడి రావటం సొంత ఊరికి వచ్చిన అనుభూతినిస్తోంది."- పాయల్ రాజ్‌పుత్, హీరోయిన్.
పాయల్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. తనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులకు హీరోయిన్ పాయల్ అభివాదం చేస్తూ.. పలకరించారు.