పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ సమ్మె 12వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాల నాయకులు ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. రామగుండం నగరపాలక కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఉద్ధృతంగా సమ్మె సాగుతున్నా ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చూసైనా కేసీఆర్ కళ్లు తెరవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఏపీ సీఎం జగన్కు పాలాభిషేకం - rtc strick peddapally
తెలంగాణలో ఏపీ సీఎంకు పాలాభిషేకం..అవును మీరు విన్నది నిజమే..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. ఏపీ సీఎం జగన్ను చూసైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.

జగన్కు పాలాభిషేకం