తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ - గోదావరిఖనిలో కార్మికులు నిరసన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. సమ్మె విరమించి విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ చేశారు.

విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ

By

Published : Nov 6, 2019, 3:37 PM IST

విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్మికులు దీక్ష చేపట్టారు. సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె విరమించి విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ దీక్షా శిబిరంలో ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి ఎన్ని డెడ్​లైన్​లు పెట్టిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యేది లేదని నాయకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details