పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ సమీపంలోని పన్నూరు క్రాస్‌రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మంథని డిపోకు చెందిన ఎపీ36వై9895 బస్సు పెద్దపల్లి నుంచి మంథనికి వస్తుండగా పన్నూర్ క్రాస్‌రోడ్ దాటిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఒకరు బేగంపేటకు చెందిన రాకేశ్, ముత్తారం గ్రామానికి చెందిన అజయ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు యువకులను బలి తీసుకున్న ఆర్టీసీ బస్సు - Ratnapur Ghat road accident peddaplli district
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరు యువకులను బలి తీసుకున్న ఆర్టీసీ బస్సు
Last Updated : Oct 25, 2019, 11:25 AM IST