పెద్దపల్లి జిల్లా మంథని వద్ద భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఉదయం భూపాలపల్లి నుంచి మంచిర్యాలకు వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సు గోదావరిఖని వద్ద ప్రమాదానికి గురైంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలుచోట్ల బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని ప్రయాణికులు తెలిపారు. కండక్టర్ మాత్రం బస్సుకు ఎదురుగా ఎడ్లబండి రావడంతో పక్కకు ఒరిగి ఉందని తెలిపింది.
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు - ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రయాణికులు ఆరోపించారు.

ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు