తెలంగాణ

telangana

ETV Bharat / state

'డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​' - rota virus vaccine

రోటా వైరస్​ వ్యాక్సిన్​ వినియోగంపై పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి సిబ్బందికి అవగాహన కల్పించారు. సెప్టెంబరు 6 నుంచి వ్యాక్సిన్​ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

'చిన్నారుల్లో డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​'

By

Published : Aug 21, 2019, 10:53 AM IST

రోటా వైరస్ వ్యాక్సిన్​తో చిన్నారుల్లో డయేరియాను అరికట్టవచ్చని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండల పరిషత్ సమావేశ మందిరంలో మంథని, ముత్తారం, రామగిరి మండలాల వైద్య సిబ్బందికి రోటావైరస్ వాక్సిన్ పనితీరుపై శిక్షణ ఇచ్చారు. సెప్టెంబర్ 5న వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 6వారాలు, 10వారాలు, 14వారాల్లో మూడు డోసులుగా ఇవ్వడం ద్వారా డయేరియా భారినపడకుండా ఉంటారని తెలిపారు. ఇప్పటికే ఇమ్యునైజేషన్​ ద్వారా వివిధ టీకాలు, వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు చెప్పారు. 2.5 మిల్లీ లీటర్ల చొప్పున నోటి పక్క భాగంలో వేయాలని... మొదటి రోజు ఏమైనా రియాక్షన్ కనిపిస్తే తదుపరి డోస్​ వేయకూడదని సూచించారు.

'చిన్నారుల్లో డయేరియా అరికట్టేందుకు రోటా వైరస్​ వ్యాక్సిన్​'

ABOUT THE AUTHOR

...view details