పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. అంతర్గాం మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి పంపు హౌస్ నుంచి జలాశయంలోకి ఎత్తిపోతలు కొనసాగుతుండటం వల్ల ఒక పంపు మోటార్ ద్వారా 2,160 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. జలాశయం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఇన్‌ఫ్లో 1,349 క్యూసెక్కులు పెరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు జలాశయాల్లో నీటి నిల్వలు 5.16 టీఎంసీలు కాగా నీటి మట్టం 140. 22 మీటర్లగా ఉంది. మొత్తం ఇన్ ఫ్లో 3,959, అవుట్ ఫ్లో 2,748 క్యూసెక్కులుగా నమోదైయ్యింది.
ఎల్లంపల్లిలో పెరుగుతోన్న నీటి మట్టం.. కొనసాగుతున్న ఎత్తిపోతలు
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పార్వతీపురం పంపు హౌస్ నుంచి జలాశయంలోకి నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. కాగా బుధవారం వరకు ప్రాజెక్టు మొత్తం ఇన్ ఫ్లో 3,959.. అవుట్ ఫ్లో 2,748 క్యూసెక్కులుగా ఉంది.
ఎల్లంపల్లిలో పెరుగుతోన్న నీటి మట్టం.. కొనసాగుతున్న ఎత్తిపోతలు
ఎల్లంపల్లి నుంచి నంది పంపుల ద్వారా వరద కాలువకు 2,297 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్‌కు 331 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కింద పెద్దపల్లి రామగుండం నియోజకవర్గాలకు 39, మంచిర్యాల జిల్లాకు 21 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది కాగా మూడు రోజులుగా పార్వతి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతుండడం వల్ల ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
ఇదీ చూడండి:తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ