Production stopped in RFCL: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో సాంకేతిక అవరోధాలతో పాటు కరోనా కారణంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ఆర్ఎఫ్సీఎల్లోని ప్రిల్లింగ్ టవర్‌లో ఏర్పడిన సాంకేతిక కారణాలతో పాటు పలువురు శాశ్వత, ఒప్పంద ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. సుమారు 120 మంది ఒప్పంద కార్మికులతో పాటు పలువురు శాశ్వత ఉద్యోగులు కరోనా బారిన పడటంతో ఉత్పత్తిని నిలిపివేశారు. ఫ్యాక్టరీలోని కొవిడ్ బాధితులకు 7 రోజుల వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
Production stopped in RFCL: ఆర్ఎఫ్సీఎల్లో నిలిచిన ఉత్పత్తి.. కారణమేమంటే.! - technical issues in rfcl
Production stopped in RFCL: రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా వాణిజ్య ఉత్పత్తిని యాజమాన్యం నిలిపివేసింది. సాంకేతిక సమస్యలు ఓ కారణం కాగా.. ఆర్ఎఫ్సీఎల్లో వందకు పైగా ఉద్యోగులు కొవిడ్ బారిన పడటంతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.
రామగుండం ఫ్యాక్టరీ
ప్రతిరోజూ 3,850 టన్నుల యూరియాతో పాటు అమ్మోనియా ఉత్పత్తి ఉద్దేశంతో గతేడాది ఫిబ్రవరిలో ఈ యూనిట్‌ను ప్రారంభించారు. ఉత్పత్తి నిలిపివేయడానికి కారణం సాంకేతిక అవరోధాలని యాజమాన్యం చెబుతున్నా.. మరో వైపు కరోనా కూడా కారణమని తెలుస్తోంది.
ఇదీ చదవండి:బండి సంజయ్ ఫిర్యాదుపై వారికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు