పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో ఇటీవల గాల్లోకి కాల్పులు జరిపిన విశ్రాంత ఆర్మీ జవాన్ బద్దం తిరుమల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బద్దం తిరుమల్ రెడ్డి ఆర్మీలో పని చేసి 2019లో పదవీ విరమణ పొందినట్లు డీసీపీ రవీందర్ వెల్లడించారు. అనంతరం జమ్మూ కశ్మీర్లో అనుమతి ద్వారా తుపాకి కొనుగోలు చేసి తన ఇంట్లో భద్రపరిచినట్లు తెలిపారు. జనవరి 1న స్థానికుల కోరిక మేరకు బద్దం తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపారన్నారు.
రవీందర్ బంధువులే..
ఈ దృశ్యాలను తిరుమల్ రెడ్డి బంధువులే చరవాణిలో చిత్రీకరించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లు రవీందర్ పేర్కొన్నారు. అయితే అవి పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. తిరుమల్ రెడ్డిని అరెస్టు చేసి తుపాకీతో పాటు 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బద్దం తిరుమల్ రెడ్డి రెండు సార్లు కాల్పులు జరిపి 14 బుల్లెట్లు వినియోగించినట్లు రవీందర్ తెలిపారు. జమ్మూకశ్మీర్లో అనుమతి ద్వారా తుపాకీ పొందిన బద్దం తిరుమల్ రెడ్డి ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ రెండు విషయాలపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రవీందర్ పేర్కొన్నారు.
విశ్రాంత ఆర్మీ జవాన్ అరెస్టు.. కాల్పుల్లో 14 బుల్లెట్లు వినియోగం ఇవీ చూడండి:తల్లీకుమార్తె దారుణ హత్య.. అతని పనేనా?