తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు - పెద్దపల్లి జిల్లా వార్తలు

గౌడ కులస్తుల ఆరాధ్యదైవం రేణుక ఎల్లమ్మ బోనాలను పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని.. అమ్మవారికి పూజలు నిర్వహించారు.

renuka ellamma bonal in peddapally district
మంథనిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

By

Published : Feb 2, 2021, 8:57 AM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మూడో రోజు కల్యాణం, నాలుగో రోజు బోనాలు సమర్పించారు. ఐదో రోజు పట్నాల కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలు ఇళ్లలో కొత్తగా చేతికి వచ్చిన పంట బియ్యం, బెల్లంతో బోనం వండి.. డప్పు చప్పుళ్లతో ఎల్లమ్మ దేవాలయానికి చేరుకొని, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని.. అమ్మవారికి పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:ఈనెల 6 నుంచి పోలీసు, రెవెన్యూ సిబ్బందికి టీకా

ABOUT THE AUTHOR

...view details