తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుల్తానాబాద్ మండలానికి చెందిన సుమన్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.
వరుస చోరీలు చేస్తున్న దొంగలు అరెస్ట్ - GOLD THEFTS ARRESTED IN RAMAGUNDAM
రామగుండం కమిషనరేట్ పరిధిలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3 లక్షల 81 వేల విలువ గల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

RAMGUNDAM POLICE ARRESTED GOLD THEFTS
గతంలోనూ పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా... వీరిలో ఎలాంటి మార్పు రాలేని రామగుండం అడిషనల్ డీసీసీ అశోక్‌కుమార్ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడానికి కృషిచేసిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.
వరుస చోరీలు చేస్తున్న దొంగలు అరెస్ట్