రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చలాన్న మహాసంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులో 12 లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. నిండుకుండలా మారిన గోదావరిలో, చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను వదులుతోందన్నారు.
'రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడమే సీఎం లక్ష్యం' - Ellampalli project news
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 12 లక్షల చేప పిల్లలను వదిలారు. నిండుకుండలా మారిన గోదావరిలో, చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను వదులుతోందన్నారు.
'రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడమే సీఎం లక్ష్యం'
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చలాన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్కు ప్రజలు మద్దతు తెలపాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ అముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్టలక్ష్మి- మహేందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్గౌస్ షా, ఎంపీటీసీ కొలిపాక శరణ్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం