తెలంగాణ

telangana

ETV Bharat / state

'రామగుండం 50 డివిజన్లలో గెలుస్తాం' - peddapalli news

భాజపా కాంగ్రెస్ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రామగుండం కార్పొరేషన్​లో గులాబీజెండా ఎగుర వేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

Ramagundam wins 50 divisions at peddapalli
'రామగుండం 50 డివిజన్లలో గెలుస్తాం'

By

Published : Jan 8, 2020, 12:35 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మహిళా సమ్మేళన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. దేశంలోనే పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని అన్నారు. రామగుండం నియోజకవర్గానికి నిత్య ప్రజాసేవకులుగా కోరికంటి చందర్ ఎమ్మెల్యేగా ఉండటం ఈ ప్రాంత అదృష్టమన్నారు. 18 గంటల పాటు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు.

రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లలో తెరాస గెలుపు ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. రానున్న నగరపాలక ఎన్నికల్లో తెరాస గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భాను ప్రసాద్ రావు, ఇతర తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

'రామగుండం 50 డివిజన్లలో గెలుస్తాం'

ఇదీ చూడండి : తెలుగు ఓటర్లు.. మలయాళం పేర్లు

ABOUT THE AUTHOR

...view details