కరోనా వైరస్ నివారణపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు గోదావరిఖనిలో వినూత్నరీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ఆకారంలో హెల్మెట్లు ధరించి కూడళ్లలో నిలబడి... తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నివారణకు పాటు పడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్ నివారణకు తోడ్పాటు అందించిన వారమవుతామని సూచిస్తున్నారు.
కరోనా హెల్మెట్‌తో వాహనాదారులకు అవగాహన - రామగుండం ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
కరోనా వైరస్ నివారణకు గోదావరిఖనిలో పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు... కరోనా ఆకృతిలో ఉన్న హెల్మెట్ ధరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.
![కరోనా హెల్మెట్‌తో వాహనాదారులకు అవగాహన ramagundam traffic police campaigning with corona helmets in godavarikhani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6622578-thumbnail-3x2-asdf.jpg)
కరోనా హెల్మెట్‌తో వాహనాదారులకు అవగాహన
ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలన్నారు. వాహనాదారులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ రామ్‌రెడ్డి, గోదావరిఖని సీఐ రమేష్ , ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా హెల్మెట్‌తో వాహనాదారులకు అవగాహన
ఇవీ చూడండి:డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందా.. ఏం పర్లేదు.