తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల ఆరోగ్యం కోసం కఠిన చర్యలు తప్పవు - Peddapalli District News

కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. సీపీ ఆధ్వర్యంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో మాస్క్‌లు ధరించని వారిపై పోలీసులు జరిమానా విధిస్తూ... స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Ramagundam Police Commissionerate latest News
మాస్క్‌లు ధరించని వారిపై పోలీసులు జరిమానా

By

Published : Apr 17, 2021, 11:12 AM IST

కరోనా వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో మాస్క్‌లు ధరించని వారిపై పోలీసులు జరిమానా విధిస్తూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్లలో సీపీతో పాటు డీసీపీ రవీందర్, ఇతర పోలీస్ సిబ్బంది... మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. బస్సుల్లో, ఆటోల్లో, కార్లలో ప్రయాణించే వారిని ఆపి మాస్కులు ధరించారా లేదా అని తనిఖీలు నిర్వహించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాస్కులు ధరించకుండా ప్రయాణిస్తున్న వారిపై 9406 కేసులు నమోదు చేశామన్నారు. ముఖ్యంగా దుకాణాలు, వ్యాపార కూడళ్లలో, పెట్రోల్ బంకుల్లో మాస్కులు లేనిది వినియోగదారులకు ఏలాంటివి వస్తువులు గాని, పెట్రోల్ గాని ఇవ్వవద్దని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సంజీవ్, గోదావరిఖని ఏసీపీ ఉమెన్ దర్, సీఐలు రమేశ్‌ బాబు, రాజ్‌ కుమార్‌లతో పాటు ఎస్ఐలు, ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తెలంగాణలో రికార్డుస్థాయి కేసులు.. ఒక్కరోజే 4,446 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details