ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. నేర పరిశోధనలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి, లక్ష్మిపురం గ్రామాల్లో రూ. 4 లక్షలతో ఏర్పాటు చేసిన 33 సీసీ కెమెరాలను రామగుండం మేయర్ అనిల్ కుమార్తో కలిసి సీపీ ప్రారంభించారు.
నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర గొప్పదని సీపీ అన్నారు. గ్రామస్థులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజల రక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.