లాక్డౌన్ వల్ల మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కోలంగూడ గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ముఖ్యమంత్రి కేసీఆర్, రాజ్యసభ ఎంపీ సంతోశ్ దృష్టికి వచ్చింది. స్పందించిన సీఎం వారికి సాయం చేయాల్సిందిగా రామగుండం సీపీ సత్యనారాయణను ఆదేశించారు.
సీఎం ఆదేశం... సీపీ సాయం - ramagundam cp satyanarayana helped kolamguda villagers
ముఖ్యమంత్రి ఆదేశంతో పెద్దపల్లి జిల్లా రామగుండం సీపీ సత్యనారాయణ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కోలంగూడా గ్రామస్థులకు సాయం చేశారు. అక్కడి గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
సీఎం ఆదేశం... సీపీ సాయం
ముఖ్యమంత్రి ఆదేశాలతో కోలంగూడ గ్రామస్థులకు రామగుండం సీపీ నిత్యావసర సరుకులు, సబ్బులు, శుభ్రత ద్రావణాలు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.