పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు స్థాయి 21వ నాణ్యత మండల సదస్సును ఎన్టీపీసీ, టీటీఎస్లోని ఉద్యోగ వికాస కేంద్రంలో నిర్వహించారు. ఈ మేరకు నాణ్యత మండల సదస్సులో ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు చెందిన 6 నాణ్యత మండల ప్రతినిధులు తమ పని నైపుణ్యాలను పవర్ పాయింట్ ప్రాజెక్టు ద్వారా ప్రదర్శించారు. బిజినెస్ ఎక్స్లెన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రామగుండం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ నాణ్యత మండలంలో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు స్థాయి 21వ నాణ్యతమండల సదస్సు - Ramagudam NTPC Latest News
రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు స్థాయి 21వ నాణ్యత సదస్సు జరిగింది. ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు చెందిన 6 నాణ్యత మండల ప్రతినిధులు తమ పని నైపుణ్యాలను పవర్ పాయింట్ ప్రాజెక్టు ద్వారా ప్రదర్శించారు.
ఉద్యోగులు అధిక సంఖ్యలో నాణ్యత మండలాల్లో పాలుపంచుకొని నాణ్యత అంశాలు ప్రదర్శించాలని సీజీఎం సునీల్ కుమార్ సూచించారు. విద్యుత్ ఉత్పత్తిలో సాంకేతిక అంశాలు మెరుగైన పనితీరు అలవర్చుకొని రామగుండం ఖ్యాతిని నిలబెట్టాలని పేర్కొన్నారు. ఈ నాణ్యత మండల సదస్సులో ఆపరేషన్ గ్రూప్-4 విభాగానికి చెందిన నాణ్యత మండలి సభ్యులు విజేతగా నిలువగా... రెండో స్థానంలో ఆపరేషన్ గ్రూప్-3 విభాగానికి చెందిన ప్రేరణ నాట్యమండలి బృందం దక్కించుకుంది మూడో స్థానంలో వైద్య ఆరోగ్య విభాగానికి చెందిన నైటింగేల్ బృందం కనీసం చేసుకుంది.