తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు అండగా నిలుస్తాం: ఎన్టీపీసీ - Ramagundam NTPC Distribute Seeds And Maskes

రామగుండం పరిసర గ్రామాల్లో ఉండే రైతులకు ఎన్టీపీసీ యాజమాన్యం ఉచితంగా విత్తనాలను పంపిణీ చేసింది. రైతులకు అండగా నిలుస్తామని పరిశ్రమ ఈడీ రాజ్ కుమార్ వెల్లడించారు.

Ramagundam NTPC Distribute Seeds And Maskes  to Farmers in Peddapalli district
రైతులకు అండగా నిలుస్తాం: ఎన్టీపీసీ

By

Published : May 17, 2020, 7:26 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షణ కార్యక్రమంలో ఈడీ రాజ్ కుమార్ పాల్గొన్నారు. సీఎస్​ఆర్​ కార్యక్రమం కింద పరిశ్రమ పరిసర గ్రామాలకు చెందిన 225 మంది రైతులకు 12రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. వీటితోపాటు 1100 మాస్కులను అందించారు.

ఈ సందర్భంగా కరోనా వైరస్​పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details