తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్యకార్మికుల ధర్నా

మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ramagundam  municipality  workers dharna to pay wage arrears
వేతన బకాయిలు చెల్లించాలని పారిశుద్ధ్యకార్మికుల ధర్నా

By

Published : Jan 30, 2021, 7:15 PM IST

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థ అధికారులు మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని పారిశుద్ధ కార్మికులు తమ విధులను బహిష్కరించారు. జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ.. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

రామగుండం నగర పాలకసంస్థ పరిధిలో పారిశుద్ధ్య వాహనాల నిర్వహణ కోసం డ్రైవర్​కు 12వేలు, సహాయకులకు 10 వేల చొప్పున వేతనాలు ఇస్తామని అధికారులు చెప్పారని కార్మికులు తెలిపారు. ఇప్పటికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నాతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:వింత సంబరం: చెట్టు కొమ్మలతో దాడి చేసుకోవడమే ఆచారం!

ABOUT THE AUTHOR

...view details