తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నబిడ్డల్లాగా కంటికిరెప్పలా కాపాడుతా: కోరుకంటి చందర్​ - పెద్దపల్లి జిల్లా వార్తలు

తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు శివాని, శిల్పినిల చదువుకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే భరోసా కల్పించారు. విజయమ్మ ఫౌండేషన్​ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ramagundam-mla-korukanti-chander-helped-to-poor-sisters-in-peddapalli-district
కన్నబిడ్డల్లాగా కంటికిరెప్పలా కాపాడుతా: కోరుకంటి చందర్​

By

Published : Nov 3, 2020, 12:34 PM IST

నిరుపేద అక్కాచెల్లెళ్లు శివాని, శిల్పినిలకు చదువుతో పాటు వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసానిచ్చారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ధర్మారపు సత్తయ్య, వనిత దంపతులు మృతిచెందారు. వారి పిల్లలైన శిల్పిని, శివాని అక్కాచెల్లెళ్లు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. వెంటనే స్పందించారు. విజయమ్మ ఫౌండేషన్ సభ్యులను లింగాపూర్ గ్రామానికి పంపించి.. ఫోన్ ద్వారా వారితో మాట్లాడారు.

తల్లిదండ్రులు లేక కష్టాలు పడుతున్న వారికి తాము భరోసాగా ఉంటామని, కన్నబిడ్డల్లాగా కంటికిరెప్పలా తాను కాపాడుతానని తెలిపారు. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వారికి 2వేల నగదుతో పాటు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను ఫౌండేషన్ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, అహ్రీన్ ఫాతిమా, ఎంపీటీసీ కొలిపాక శరణ్య, విజయమ్మ ఫౌండేషన్​ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సన్నరకానికి మద్దతు ధర చెల్లించని మిల్లర్లపై టాస్క్​ఫోర్స్ కొరడా

ABOUT THE AUTHOR

...view details