పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక ప్రాంతంలోని 30వ డివిజన్లో ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మొక్కలు నాటారు. అనంతరం మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో వాతవారణ సమతుల్యతను కాపాడి ఆరోగ్య తెలంగాణాగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపటినట్లు ఆయన వెల్లడించారు.
సమష్టి కృషితోనే ఆకుపచ్చ రామగుండం సాధ్యం: ఎమ్మెల్యే చందర్ - ramagundam MLA Korukanti Chandar latest news
ఆకుపచ్చ రామగుండంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. వాతవారణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

ఆకుపచ్చ రామగుండంగా మారుద్దాం
కాలుష్యానికి నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. మహిళలు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి డివిజన్లో లక్ష మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
TAGGED:
ఆకుపచ్చ రామగుండంగా మారుద్దాం