పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు రాష్ట్ర సర్కారు ఆపన్నహస్తం అందించింది. వారిని ఆదుకునేందుకు ఉపశమన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 12 కిలోల బియ్యంతో పాటు 1500 నగదును పంపిణీ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరు ఆకలి బాధతో ఉండకూడదన్న ఉద్దేశంతో పలు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు, అభాగ్యులకు అన్నదానం చేస్తున్నాయి.
అన్నార్తులకు ఎమ్మెల్యే బాసట - Ramagundam MLA Korukanti Chandar Help for Migrants
దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో వలసకూలీలపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే కొంతమంది దాతలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల అన్నదానాలు నిర్వహించి ఉదారతను చాటుకుంటున్నారు.
అన్నార్తులకు ఎమ్మెల్యే బాసట
TAGGED:
అన్నార్తులకు ఎమ్మెల్యే బాసట